
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ ఎమ్మెల్యే దద్దమ్మ అని, ఆయన అసమర్థతతో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. గజ్వేల్, సిద్దిపేట ఎట్లా అభివృద్ధి చెందాయీ.. హుస్నాబాద్ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. సోమవారం ఆయన హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏంచేశానో ఎమ్మెల్యేకు వివరాలు పంపుతున్నానని, ఆయన ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్వాయి పాపన్నకోట, పొట్లపల్లి రాజన్న, హుస్నాబాద్ ఎల్లమ్మ, కొత్తకొండ వీరన్న గుడులపై శ్రద్ధ పెడితే టూరిస్టు ప్లేసులయ్యేవన్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. సీపీఐతో పొత్తు చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థే బరిలో ఉంటారని చెప్పారు.
ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, సిద్దిపేట జిల్లా ప్రధానకార్యదర్శి చిత్తారి రవీందర్, కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్ పాల్గొన్నారు.