కాంగ్రెస్​ బలం పెరుగుతోందనే వేధింపులు : పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్​ బలం పెరుగుతోందనే వేధింపులు : పొన్నం ప్రభాకర్
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: దేశంలో కాంగ్రెస్​ బలం పెరుగుతోందనే పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్​గాంధీపై ఈడీ పేరుతో వేధింపులు షురూ చేశారని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. హుస్నాబాద్​నియోజకవర్గ పరిధి భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అంటేనే ఈడీ, మోడీ, ఐటీ దాడులన్నారు. దేశంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ పార్టీ బలం పెరుగుతోందని, ప్రజల పక్షాల ఉద్యమాలు చేస్తుంటే బీజేపీపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్నారు.

 అది తట్టుకోలేక అగ్రనేతలపై నేషనల్ హెరాల్డ్​ కేసులో ఈడీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నేషనల్ హెరాల్డ్​ విషయంలో నిజంగా ఏదైనా పొరపాటు చేసి ఉంటే చర్యపరమైన యాక్షన్​ తీసుకోవచ్చని, కానీ ఈడీని కేవలం వేధింపుల కోసమే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్​కు దండ వేసి నివాళులర్పించలేని నాయకులు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.