తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో అమలు చేశామన్న పొన్నం ఈ సారి అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్,కేశవపూర్, గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పొన్నం.
గతంలో ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా పని చేశానో... రేపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కూడా అలాగే పని చేస్తానని పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ అందినవాళ్లంతా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని లేదంటే ఆ పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. హుస్నాబాద్ లోని నిధులను మొత్తం కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేటకు పట్టుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు లేవన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అనేవి బాండ్ పేపర్ లాంటివని చెప్పారు. ప్రజలకు తాను ఎప్పటికి అందుబాటులో ఉంటానని తెలిపారు.