
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్లే పోటీలో నిలవలేదని, ఎన్నికల్లో తాము ఏ పార్టీకీ సపోర్ట్ చేయమని పొన్నం అన్నారు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్య ర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పం దంతో మద్దతు తెలిపిందన్నారు. 23 ఓట్లున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీకి ఇంటర్నల్ మద్దతు ఇస్తుందన్నారు. ' కాంగ్రెస్ పోటీలో లేదు. మేము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారు. ' అని మంత్రి పొన్నం అన్నారు.