ఉద్యమకారులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి : పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఎఫ్ఐఆర్ అయినవాళ్లకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ కేసులు కాకపోయినా అరెస్టయి పోలీస్ స్టేషన్లలో జీడీలో ఎంట్రీ అయినవాళ్లకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చే విషయమై ప్రభుత్వంతో మాట్లాడుతానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ ఉన్న పదేళ్లలో ఏనాడూ ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉద్యమకారులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గత సర్కార్ లో మంత్రులు, సీఎంకు సమస్యలు చెప్పుకునే అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోల డైరీని పొన్నం ఆవిష్కరించారు. 

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్  నేత 

కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఆయనకు పార్టీ కండవా కప్పి ఆహ్వానించారు. అతనితోపాటు లీడర్లు జంగ శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్ర, యాగండ్ల అనిల్ కుమార్, సిద్ది లక్ష్మణ్, వెంకటేశం, రంగు చెన్నయ్యగౌడ్, పంజాల వెంకన్న, నవీన్, వాసర హాస్పిటల్ చైర్మన్ వాసరయ్య, పురుషోత్తం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.