సమ్మక్క సారక్కలే మా సర్కార్​కు బలం : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు: సమ్మక్క సారక్కలే తమ సర్కార్​కు కొండంత బలమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో సమ్మక్క సారక్కకు ఎత్తు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సమ్మక్క సారక్కకు మొక్కుకున్నారు.  

కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాAdకుండా చూడాలని, తాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా, ప్రభుత్వానికి మార్గదర్శనమివ్వాలని వేడుకున్నానన్నారు. ఎలాంటి గండమొచ్చినా అమ్మవార్ల అండతో సులువుగా దాటుతామన్నారు. ఆయన వెంట టీపీసీసీ మెంబర్​ కేడం లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​శివయ్య, పార్టీ హుస్నాబాద్​ మండల అధ్యక్షుడు చందు, కౌన్సిలర్లు పద్మ, సరోజన, నాయకులు రవీందర్​, హసన్​, శ్రీనివాస్ ఉన్నారు.