
హుస్నాబాద్, వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ను లేకుండజేయాలె అని కాంగ్రెస్ హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం అక్కన్నపేట మండలం కట్కూరు, కన్నారం, ఇచ్చుల్లపల్లె, దుబ్బ, రాజు, సీతారాం, వంకాయ, దాసు, పలుగు, పాన్య, చాపగాని తండాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన రాజుతండాకు చెందిన నరసింహ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో పేదల భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. మరోసారి బీఆర్ఎస్అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు ఆగమవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read :- రెండోరోజు పొంగులేటి ఇళ్లల్లో ఐటీ రైడ్స్.. శ్రీనివాసరెడ్డి రూమ్ కీస్ కోసం అధికారుల వెయిటింగ్