
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్రమోదీ కొట్టినట్టు చేస్తే సీఎం కేసీఆర్ఏడ్చినట్లు చేస్తడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు ఏదో కొత్త హామీలు అన్నట్టు చెబుతున్నారని, అవి రాష్ట్ర విభజన హామీలన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఆ హామీలను ప్రకటించారని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీతో పాలమూరులో సభ నిర్వహించడం ఇక్కడి బీజేపీ నాయకుల సిగ్గులేనితనానికి నిదర్శనమన్నారు. గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని.. 70 ఏండ్ల ఆజాదీకా ఉత్సవాల్లోనూ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ చరిత్రను కనిపించకుండా చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.