భీమదేవరపల్లి/ఎల్కతుర్తి, వెలుగు : కేసీఆర్ నటుడు అయితే మోదీ మహానటుడు అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు, ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు 33 రోజుకు కష్టపడి తనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు శ్రమిస్తానని చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
హుస్నాబాద్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా పనిచేస్తానని చెప్పారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో ఏఐసీసీ ప్రతినిధులు మాట్లాడుతున్నారని, రెండు రోజుల్లో ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్, అసెంబ్లీ అబ్జర్వర్ గోపీనాథ్ పాల్గొన్నారు.
ALSO READ : కేటీఆర్ లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలి