"హాత్ సే హాత్ జోడో"ను ప్రారంభించిన పొన్నం ప్రభాకర్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో కార్యక్రమానికి సంఘీభావంగా "హాత్ సే హాత్ జోడో" కార్యక్రమం చేపట్టినట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. భారతీయులంతా కలిసి ఉండాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పద్మనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "హాత్ సే హాత్ జోడో" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రోహిత్ రావు తదితరులు హాజరైయ్యారు.