సైదాపూర్, వెలుగు: తన విజయంలో అండగా నిలిచిన ప్రతిఒక్క కార్యకర్త, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, అండగా ఉంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సైదాపూర్మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు విజయం చేకూర్చిన హుస్నాబాద్ ప్రజలకు కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటానన్నారు.
అనంతరం నియోజవర్గంలోని ప్రజా సమస్యలపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వం పథకాలు చేరువయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, లీడర్లు ఊసకోయిల రాఘవులు, రవీందర్ రావు పాల్గొన్నారు.