హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన పడద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని పొన్నం ప్రకటించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా.. కార్యకర్తల కోరిక మేరకు నేను పోటీకి సిద్ధమయ్యానని పొన్నం వ్యాఖ్యానించారు.
పది సంవత్సరాలు గడిచిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం ఎమ్మెల్యే సతీష్ కుమార్ అసమర్థత కదా అని ప్రశ్నించారు. ప్రజలు ఆకాంక్షించిన విధంగా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో టూరిజం, పారిశ్రామిక రంగం, నిరుద్యోగ సమస్య, తీర్చేందుకు ఏమి చేశారని ఎమ్మెల్యేను నిలదీశారు. పార్లమెంట్ అభివృద్ధిపై చర్చకు రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించినా ఎందుకు రాలేదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పొన్న ప్రభాకర్ సమావేశం నిర్వహించారు.