నేపాల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్​గా పొన్నం రవిచంద్ర

నేపాల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్​గా పొన్నం రవిచంద్ర

హైదరాబాద్, వెలుగు: నేపాల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గా డాక్టర్ పొన్నం రవిచంద్ర నియమితులయ్యారు. ఖాట్మండులో ఈ నెల19 నుంచి 25 వరకు 8వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగనుంది. దీనికి రవి చంద్రతో పాటు నేపాల్ కు చెందిన రక్షయ సింగ్ రాణా, స్పెయిన్ కు చెందిన జోవాన్ మార్క్ మొంటియల్ దీయాజ్ లను నియమించినట్టు ఫెస్టివల్ చైర్ పర్సన్ కేపీ.పాఠక్ తెలిపారు. డాన్ క్విక్సోట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ చిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేయనున్నారని చెప్పారు. కాగా, పొన్నం రవిచంద్ర ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ (ఐఎఫ్ఎఫ్ ఎస్ ) రీజియన్ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.