PS2కి మొదటిరోజు రికార్డ్ కలెక్షన్స్.. ఎఫెక్ట్ చూపించని ఏజెంట్

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్2. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మామూలు సినిమాలనే మాస్టర్ పీస్ లీ తీసే మణిరత్నం.. ఈ సినిమాని నెక్స్ట్ లెవల్లో చుపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక మూవీకి వచ్చిన భారీ హైప్ తో.. మొదటిరోజు కలెక్షన్స్ కూడా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే దాదాపు 34 కోట్ల వరకూ రాబట్టిందని సమాచారం. ఓవర్సీస్ లో కూడా పొన్నియిన్ సెల్వన్ 2 దుమ్ముదులిపేసింది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి 1.6 మిలియన్ కలెక్ట్ చేసిన ఈ మూవీ, 2 మిలియన్ ని మార్క్ చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఇక పార్ట్ 1 కన్నా పార్ట్ 2కి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం, సినిమా ఎంగేజింగ్ గా ఉండడంతో పొన్నియిన్ సెల్వన్ 2కి బుకింగ్స్ మధాహ్నం షో నుంచి మరింత పెరిగాయి. ఇదిలా ఉంటె.. తెలుగు రాష్ట్రాల్లో PS-2 మూవీని ఏజెంట్ ఇబ్బంది పెడుతుందని అనుకున్నారు. కానీ.. ఆ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో PS2కి తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.