హైదరాబాద్: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. టెంఫుల్లోని శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో ఇవాళ పురుషసూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో అభిషేకం హొమం నిర్వహించి, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో ఏటా భరణి నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
ALSO READ | గడప దాటని ‘తెలంగాణ’పత్రిక: ముద్రించి మూలకేస్తున్న I & PR