‘సర్కస్‌‌’తో వస్తున్న పూజాహెగ్డే

‘సర్కస్‌‌’తో వస్తున్న పూజాహెగ్డే

ఈ ఏడాది ఇప్పటికే నాలుగు భారీ సినిమాలతో ఆకట్టుకున్న పూజాహెగ్డే, డిసెంబర్‌‌‌‌లో బాలీవుడ్‌‌ మూవీ ‘సర్కస్‌‌’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక వరుస షూటింగ్స్‌‌తో బిజీగా ఉన్న పూజ.. కాలికి గాయం అవడంతో గత కొద్దిరోజులుగా రెస్ట్ తీసుకుంటోంది. రెస్ట్ అనగానే ఎవరైనా వెయిట్ పెరుగుతుంటారు. కానీ పూజ మాత్రం మరింత నాజూగ్గా మారింది. ఇటీవల ‘సర్కస్‌‌’ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌కు హాజరైన ఆమె, నయా లుక్‌‌తో ఇంప్రెస్ చేయడంతో పాటు రణవీర్‌‌‌‌తో కలిసి స్టెప్పులేసింది.

ట్రైలర్‌‌‌‌ కూడా అవుట్ అండ్ అవుట్‌‌ కామెడీతో ఆకట్టుకుంది. 1960 బ్యాక్ డ్రాప్‌‌ సినిమా ఇది. డ్యుయెల్ రోల్‌లో తనదైన కామెడీ టైమింగ్‌‌తో మెప్పించాడు రణవీర్. పూజతో పాటు జాక్వెలిన్ గ్లామరస్‌గా కనిపించింది. స్పెషల్ సాంగ్ చేసిన దీపిక ట్రైలర్‌‌‌‌ చివర్లో మెరిసింది. మొత్తానికి రోహిత్ శెట్టి మార్క్ కామెడీతో పాటు ముగ్గురు హీరోయిన్స్‌ గ్లామర్‌‌తో కలర్‌‌ఫుల్‌ ఫన్‌ రైడ్‌లా ఉంది ‘సర్కస్‌’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమా విడుదల కానుంది.ఈ మూవీ సక్సెస్‌‌తో బాలీవుడ్‌‌లో మరో మెట్టు పైకి ఎక్కాలని కోరుకుంటోంది పూజ. ఇక తెలుగులో మహేష్‌‌బాబుకు జంటగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోన్న ఆమె, బాలీవుడ్‌‌లో సల్మాన్‌‌తో కలిసి ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్‌‌’లో నటిస్తోంది.