
హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)తన రెండో ఇన్నింగ్స్‌ను విభిన్నంగా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పూజా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న రెట్రో (Retro)లో హీరోయిన్గా కనిపిస్తుంది. అయితే, ఈ ముంబై బ్యూటీ రెట్రో సినిమాతో తన ప్రత్యేకతను చాటుకోనుంది.
అదేంటంటే, ఈ తమిళ చిత్రంలో పూజా తొలిసారిగా తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతోంది. ఈ సినిమాలో తనదైన శైలిలో తమిళ గొంతును వినిపించబోతుంది. పూజా 2012 లో తమిళ చిత్రం 'మూగమూడి'తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇన్నాళ్లు తన గొంతుని వినిపించలేకపోయింది. 2021లో విజయ్ సరసన బీస్ట్ మూవీలో నటించినప్పటికీ తనకు తానూ డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. ఇక రెట్రో సినిమాతో తన ప్రతిభకు అద్దం పట్టేలా ప్రయత్నం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
పూజా హెగ్డే ఇప్పటికే బాలీవుడ్ మరియు దక్షిణ భారత సినిమాల్లో తనదైన సినిమాలతో దూసుకెళ్లింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక కొన్నాళ్ళు ఈ అమ్మడు కెరీర్లో వరుస ఫెయిల్యూర్స్ పలకరించడంతో కొంత గ్యాప్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ డెసిషన్స్‌తో కొత్త ఇన్నింగ్స్ షురూ చేసింది. ఈ క్రమంలో పూజా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది.
రెట్రో మూవీ విషయానికి వస్తే:
స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న రెట్రో మూవీ మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రీబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.
ఈ సినిమాలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 2D ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక సూర్య కలసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.