
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తోంది. రెండు రోజుల్లో ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రెట్రో లుక్‌లో బ్యూటిఫుల్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ శారీ కట్టుకుని, నుదిటిన బొట్టు, మట్టి గాజులు, మల్లెపూలతో ఉన్న ఆమె స్టిల్స్ అందర్నీ ఆకర్షించాయి.
‘70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అమ్మమ్మ కంజీవరంలో గడిపిన దృశ్యాలు, పెళ్లికి వెళ్లే ముందు ఇంట్లో ఉండే మల్లెల వాసన, తొలి చినుకుల తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు.. ఓహ్, చిన్న విషయాల్లో ఎంత అందం’ అంటూ పూజ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇక ‘రెట్రో’ చిత్రం పూజా హెగ్డే వింటేజ్ లుక్‌లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చీరకట్టులో కనిపించి మెస్మరైజ్ చేసింది. మరోవైపు రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో పాటు విజయ్ ‘జననాయగన్’, లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాంచన 4’లో పూజ నటిస్తోంది. అలాగే ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.