తెలుగు సినిమాల్లో బుట్ట బొమ్మ కనిపించేది ఎప్పుడు.?

తెలుగు సినిమాల్లో బుట్ట బొమ్మ  కనిపించేది ఎప్పుడు.?

వరుస క్రేజీ ప్రాజెక్టులు, స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే పూజాహెగ్డే.. గత కొన్నాళ్లుగా రేసులో వెనుకబడింది.  గత ఏడాది ఆమె నటించిన ఒకే ఒక చిత్రం విడుదలైంది. అది కూడా డిజాస్టర్ అవడంతో ఇక కెరీర్‌‌‌‌ ముగిసినట్టే అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో ఫుల్‌‌ ఫామ్‌‌లోకి వచ్చేసింది. అందులో షాహిద్ కపూర్‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ‘దేవా’ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్‌‌గా షాహిద్ నటిస్తుండగా,  దియా అనే ఇన్వెస్టిగేటివ్‌‌ జర్నలిస్ట్‌‌ పాత్రలో పూజా నటిస్తోంది. 

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌‌గా తన క్యారెక్టర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.  మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్‌‌ దీన్ని డైరెక్ట్ చేశాడు. మరోవైపు సూర్య, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘రెట్రో’ మే 1న విడుదల కాబోతోంది. ఇక తమిళ హీరో విజయ్‌‌ 69వ చిత్రంలోనూ ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇదికాక వరుణ్ ధావన్‌‌కు జంటగా నటిస్తున్న ఓ హిందీ చిత్రం సెట్స్‌‌పై ఉంది.  అయితే ఆమె తెలుగులో సినిమా చేసి మాత్రం మూడేళ్లు కావస్తోంది. రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు పూజాహెగ్డే. మరి తెలుగు సినిమాల్లో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి!