సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) సినిమా ‘గుంటూరు కారం(Guntur kaaram)’ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman)ను తొలగించారనే వార్త ప్రచారమైంది. దీంతో ఇందులో నిజం లేదని ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పూజా హెగ్దే(Pooja Hegde)ను కూడా సైడ్ చేశారనే వార్తలు వస్తున్నాయి. నిర్మాత సైతం రూమర్లు నమ్మవద్దని కోరాడు. అయినా, ఈ వార్తలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఈ సినిమాలో పూజాకి బదులుగా విరూపాక్ష(Virupaksha) హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha manon)ను తీసుకున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వార్త మాత్రం వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇందులో శ్రీలీల(Sreeleela) మరో హీరోయిన్గా నటిస్తోంది. ఒకవేళ పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నదనే వార్తలో నిజముంటే ఈ ఇద్దరు మద్దుగుమ్మల్లో లీడ్ రోల్ చేసేది ఎవరు? సెకండ్ రోల్ చేసేది ఎవరనే విషయం ఆసక్తిగా మారింది.