
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకి పవర్ఫుల్ యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ్, కన్నడ, హిందీ మరియు తెలుగు సినీ పరిశ్రమలకి చెందిన స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇందులోభాగంగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ & పీరియాడిక్ డ్రామా జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి.
అయితే ఈ పవర్ఫుల్ యాక్షన్ సినిమాలో కొంచెం గ్లామర్ టచ్ ని యాడ్ చేస్తూ స్పెషల్ సాంగ్ కోసం పొడుగుకాళ్ల సుందరి పూజ హెగ్డేని సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు. అంతేకాదు ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
గతంలో పూజ హెగ్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో కూలీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని పూజ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కాదు కదా కనీసం పాటలు పెట్టడానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ ఉన్నట్లుండి రజినీకాంత్ సినిమాకి గ్లామర్ టచ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
Yes, you guessed it right!❤️🔥 @hegdepooja from the sets of #Coolie @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv@girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/SThlymSeog
— Sun Pictures (@sunpictures) February 27, 2025
ఇక నటి పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళ్, హిందీ, తెలుగు తదితర భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోంది. తమిళ్ లో ప్రముఖ హీరో సూర్య హీరోగా నటిస్తున్న "రెట్రో" సినిమాలో ఫీమేల్ లీడ్ పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రముఖ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న "కాంచన 4" సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తోంది.