రాధే శ్యాం తర్వాత తెలుగులో పూజా మరో సినిమా చేయలేదు. ఇటీవల వచ్చినట్టే వచ్చి గుంటూరు కారం మూవీలో ఆఫర్ చేజారింది. అయినా ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. యాడ్స్, షాప్ ఓపెనింగ్స్‌తో ఈ బ్యూటీ బిజీగా గడిపేస్తుంది.
ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి ఈ హీరోయిన్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుకుంటోందని ఓ వార్త వైరలవుతోంది. ఇటీవల ఓ షాప్ ప్రారంభోత్సవంలో పూజా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఫంక్షన్లకు హాజరైతే హీరోయిన్లు అరగంట కూడా అక్కడ ఉండరు.
అలాంటిది పూజా కోసం ఏకంగా రూ. 40 లక్షలు ఆఫర్ చేస్తున్నారట. ఇది తెలిసి ఫ్యాన్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అలాంటిదని అంటున్నారు.