
వరుస పరాజయాలతో రేసులో వెనుక బడ్డ పూజాహేగ్డేకు.. కోలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ దక్కింది. సూర్యకు జంటగా ఆమె నటించబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు. శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమ సినిమాలోకి వెల్‌కమ్ చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
సూర్య కెరీర్‌లో ఇది 44వ సినిమా. త్వరలో అండమాన్ దీవుల్లో షూటింగ్ మొదలవనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.