కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని మెట్టురామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివయ్య దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం అధిక ధరలతో ఇబ్బందులు పడ్డారు. కిందటి ఏడాది కూడా ఇలానే జరిగింది. ఎండోమెంట్ అధికారులు నిర్ణయించిన ధర కంటే టెండర్ దారులు రెట్టింపు ధరతో పూజ సామాన్లు అమ్మారు.
కొబ్బరి కాయ 30రూపాయలకు మించి అమ్మకూడదని టెండర్ లో ఉన్నప్పటికీ దానిని రూ. 50 అమ్మకాలు జరిగాయి. 100గ్రాముల లడ్డూ ప్రసాదాలు 5 నుంచి 10రూపాయలు పెంచారు. బైక్, కారు పార్కింగ్ కు 50 నుంచి 100 వసూలు చేశారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడంతో భక్తుల జేబులకు ఏటా చిల్లులు తప్పడం లేదు.