Tasty Food: పూల్​ మఖానా (తామరగింజల) రైతా.. ఒక్క సారి తింటే వదలరు..!

Tasty Food:  పూల్​ మఖానా (తామరగింజల) రైతా.. ఒక్క సారి తింటే వదలరు..!

పూల్​మఖానాను ఫ్యాక్స్​ నట్స్​ అంటారు. ఫ్యాక్స్​ నట్స్​ అంటే తెలుగులో తామరగింజలు.  వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్స్​... ఫైబర్​ కంటెంట్​..విటమిన్లు...ఇతర ఖనిజ పోషకాలు ఉంటాయి. తామరగింజలతో తయారు చేసిన ఫుడ్​ బాలింతలకు ఎంతో మంచి ఆహారం.  ఇప్పుడు మఖానా రైతాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .

చాలామంది పసిపిల్లల తల్లులు బాధపడుతుంటారు.  పిల్లలకు పాలు సరిపోవడం లేదంటూ.. గేదె పాలు పడుతుంటారు.  కాని ఆపాలు పసివారికి జీర్ణం కాక.. బాధ చెప్పలేక వారు పడే బాధ అంతా ఇంతా కాదు.  కాని పసిపిల్లలకు తల్లిపాల కంటే బలమైన ఫుడ్​ మరొకటి లేదని అనేక వైద్య పరిశోధనల్లో తేలింది. అయితే వీటితో రకరకాల ఫుడ్​ ను  వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.  

మఖానా రైతా తయారీకి కావలసినవి

  • ఫూల్​ ​మఖానా ( తామరగింజలు) – ఒక కప్పు
  • నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
  • పెరుగు – రెండు కప్పులు
  • జీలకర్ర పొడి, చాట్ మసాలా – ఒక్కో టీస్పూన్
  • మిరియాల పొడి – అర టీస్పూన్
  • బెల్లం – రెండు టేబుల్ స్పూన్లు
  • దానిమ్మ గింజలు – కొన్ని
  • కొత్తిమీర – కొంచెం
  • ఉప్పు – సరిపడా

తయారీ విధానం: ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో మఖానా వేసి వేగించాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా కలపాలి. అందులో జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, బెల్లం, కొత్తిమీర, ఉప్పు, మఖానా, దానిమ్మ గింజలు వంటివి వేసి మరోసారి బాగా కలపాలి. అంతే.. వెరీ టేస్టీ మఖానా రైతా రెడీ. ఈ రైతాని ఇలాగే కాదు.. రెగ్యులర్​గా చేసుకునే పెరుగు చట్నీలా కూడా తయారుచేసుకోవచ్చు. 

ఫూల్​ మఖానాతో ఇంకా ఏమేం చేయొచ్చంటే.. 

చివ్డా, భేల్, చాకొలెట్ మఖానా, స్పైసీగా శ్నాక్​ చేసుకోవచ్చు. అంతేకాదు.. మఖానాని పిండి చేసి దాంతో దోశలు, ఊతప్పం వంటివి కూడా వేసుకోవచ్చు. లడ్డూ, బర్ఫీలాంటివి కూడా తయారుచేసుకోవచ్చు. మరింకేం మఖానాని ఒక పట్టు పట్టేయండి. 

–వెలుగు,లైఫ్​–