RBI News: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరు ఈ పూనమ్ గుప్తా..?

RBI News: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరు ఈ పూనమ్ గుప్తా..?

Poonam Gupta: మరి కొద్ది రోజుల్లో రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వు బ్యాంకు కొత్త డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా ఎంపిక చేయబడ్డారు. దీంతో ఏప్రిల్ 7 నుంచి 9కి మధ్య జరిగే సమావేశాలకు మునుపే ఆమె బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె డిప్యుటీ గవర్నర్ హోదాలో 3 సంవత్సరాల పాటు సేవలు అందించనున్నారు.

అయితే భారత ప్రభుత్వం ఆమెను రిజర్వు బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ గా ఎంపిక చేయటానికి మునుపు గుప్తా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. పైగా ఆమె ప్రధాని ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. అలాగే 16వ ఆర్థిక కమిషన్ సలహా మండలి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి ముందు అమెరికా వాషింగ్టన్ డీసీలో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. 

Also Read:-గుడ్‌న్యూస్ చెప్పిన అనిల్ అంబానీ.. బకాయిల చెల్లింపు, స్టాక్ దూకుడు..

గుప్తా దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఇండియన్ స్టాటస్టికల్ ఇన్ స్టిట్యూట్లలో టీచింగ్స్ కూడా ఇచ్చారు. పూనమ్ గుప్తా అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే దిల్లీ విశ్వవిద్యాలయంలోని దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంపై ఆమె చేసిన డాక్టరల్ పనికి 1998 ఎక్సిమ్ బ్యాంక్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇవే కాకుండా ఆమె అనేక ప్రఖ్యాత కమిటీల్లో కూడా తన సేవలను అందించారు.