ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్‌పై దాడి చేసినందుకు, ఆమెను తీవ్రంగా కొట్టినందుకు శామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పూనమ్‌కు తల, కళ్లతోపాటు మొహంపై గాయలయ్యాయి. దీంతో ఆమెను ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. తనను దారుణంగా కొట్టాడని.. భర్త శామ్ బాంబేపై స్వయంగా పూనమ్ పాండే కేసు నమోదు చేసింది. పూనమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద శామ్ బాంబేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Maharashtra | Actress Poonam Pandey's husband Sam Bombay was arrested yesterday in Mumbai after the actress complained that he assaulted her. Poonam Pandey was admitted to a hospital: Mumbai Police
— ANI (@ANI) November 8, 2021
కాగా, రెండేళ్లు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పూనమ్, శామ్‌ల జోడీ.. గతేడాది పెళ్లి చేసుకుని ఒక్కటైంది. వివాహం తర్వాత గోవాలో హనీమూన్ కోసం వెళ్లి గొడవపడ్డారు. భర్త శామ్ బాంబే తనను హింసిస్తున్నాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పూనమ్. దీంతో గోవా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే అతడికి బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి కలసిపోయారు. దీనిపై అప్పట్లో పూనమ్ స్పందిస్తూ.. భార్యాభర్తలకు గొడవలు కామన్ అని, అందరి జీవితాల్లోనూ ఒడిదుడుకులు ఉంటాయనడం గమనార్హం.