మిర్యాలగూడ నియోజకవర్గంలో నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం

మిర్యాలగూడ, వెలుగు :  కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్ల క్వాలిటీ ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు వేయడం పూర్తై 15 రోజులు కూడా గడవకముందే ఎక్కడికక్కడ పగుళ్లు వస్తున్నాయి. రోడ్డు వేసే టైంలోనే క్వాలిటీని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం, ఆఫీసర్ల అలసత్వం కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధానం వృథా అవుతోంది. 

రూ. 23.80 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీసీ రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మిర్యాలగూడ మండలానికి రూ. 9.20 కోట్లు, దామరచర్లకు రూ. 7 కోట్లు, మాడ్గులపల్లి, అడవిదేవులపల్లి రూ. 5.20 కోట్లు, వేములపల్లి మండలానికి రూ. 2.40 కోట్ల చొప్పున మొత్తం రూ. 23.80 కోట్లను శాంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో నెల రోజుల క్రితం పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఇప్పటివరకు 25 నుంచి 35 శాతం మేర పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, మిగతా చోట్ల ఇంకా సాగుతున్నాయి.

15 రోజులకే పగుళ్లు

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో వేస్తున్న సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా వాడడంతో పాటు, క్యూరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగ్గా చేయడం లేదు. దీంతో వేసిన కొన్ని రోజులకే రోడ్డుపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని బల్లూనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తండాలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులతో వేసిన సీసీ రోడ్డు 15 రోజులకే పగుళ్లు పట్టింది. దీంతో నిధులన్నీ వృథా అయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి సీసీ రోడ్లు క్వాలిటీగా నిర్మించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.