ధరణి వల్లే రైతుల తిప్పలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ధరణి పోర్టల్  కరెక్ట్​ లేకనే పేద రైతులు పట్టాలు కాక ఆఫీసుల చుట్టు తిరుగుతూ తిప్పలు పడుతున్నారని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్  ఓట్ల కోసం అబద్దాలు చెప్పి ప్రజలను, రైతులను మరోసారి మోసం చేయాలని ప్రయత్నించారన్నారు.

తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములు కబ్జాదారుల చేతుల్లోకి పోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సెల్  చైర్మన్  సాయిబాబా, మహిళా కాంగ్రెస్  జిల్లా అధ్యక్షురాలు వసంత రాఘవేంద్రరాజు పాల్గొన్నారు.