![న్యూఇండియా బ్యాంక్ బోర్డు రద్దు](https://static.v6velugu.com/uploads/2025/02/poor-governance-rbi-replaces-new-india-co-op-banks-board-for-12-months_7UJQBfVsdo.jpg)
న్యూఢిల్లీ:ముంబై కేంద్రంగా పనిచేసే న్యూ ఇండియా బ్యాంకుపై పలు కఠిన చర్యలు తీసుకున్న మరునాడే ఆర్బీఐ దాని బోర్డును కూడా రద్దు చేసింది. పాలనాపరమైన లోపాల వల్లే బోర్డును 12 నెలల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిపింది.
కొత్త లోన్లు ఇవ్వకూడదని, డిపాజిట్ విత్‌డ్రాలను ఆరు నెలల పాటు ఆపాలని స్పష్టం చేసింది. దీనికి 28 బ్రాంచ్‌లు ఉన్నాయి. బ్యాంకు నిర్వహణ కోసం ఎస్బీఐ మాజీ అధికారి శ్రీకాంత్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.