జనగామ జిల్లాలో సర్కార్ భూమిలో గుడిసెలు

జనగామ జిల్లాలో సర్కార్ భూమిలో గుడిసెలు

బచ్చన్నపేట, వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గోపాల్​నగర్​లోని సర్కార్ భూమిలో శనివారం తెల్లవారేసరికి సీపీఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేశారు. 174 సర్వే నెంబరులో ఎనిమిది ఎకరాలు సర్కారు భూమి ఉండగా, ఏడు ఎకరాల్లో మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు రెండు వందల మంది పేదలు గుడిలు వేశారు. ఇప్పటికే సీపీఎం ఆధ్వర్యంలో రెండుసార్లు గుడిసెలు వేయగా, పోలీసులు తొలగించి ముప్పై మందిపై కేసులు నమోదు చేశారు.

మళ్లీ అదే భూమిలో గుడిసెలు వేశారన్న విషయం తెలుసుకున్న జనగామ ఏసీపీ అంకిత్​కుమార్​, నర్మెట్ట సీఐ సాయిరమణ, ఎస్సై శ్రీకాంత్, తరిగొప్పుల ఎస్సై స్వాతి స్పెషల్ పోలీసు బలగాలతో వెళ్లారు. వారితోపాటు తహసీల్దార్ విశాలాక్షి గుడి సెలవద్దకు చేరుకున్నారు. గుడిసెలు వేయడానికి కారణమైన పలువురు సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని, వదిలేశారు.

అనుమతిలేకుండా సర్కారు భూములను ఆక్రమించుకోవడం నేరమని ఏసీపీ అంకింత్​కుమార్​ సూచించారు. కాగా, కలెక్టర్ అనుమతి కోరేందుకు పలువురు సీపీఎం నాయకులు జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లగా, పేదలందరికీ ఇక్కడ డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గుడెలు వేసిన ప్రజలు డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా సీపీఎం నాయకులు నిలిచారు.