ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని శివన్నగూడెం నిర్వాసితుల డిమాండ్

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొండిగా కొనసాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఓటు వేసుందుకు ఆసక్తి చూపడం లేదు. ఉపఎన్నిక రావడంతో.. ఇన్ని రోజులు పట్టించుకోని.. ప్రభుత్వం ఇప్పుడు హామీలు ఇస్తోదంటూ వారు మండిపడుతున్నారు. శివన్నగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వాసితులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని వారు ఆరోపిస్తున్నారు. 

ఉపఎన్నికల రావడంతో ప్రజలు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ గ్రామానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని చెప్పినా.. ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పటివరకు కేవలం 33 శాతంగా నమోదైంది.