నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం.. లోకాయుక్తకు గ్రామస్తుల ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా: బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా జరుగుతుండడంపై గ్రామస్తులు నేరుగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రజోపయోగకరమైన బ్రిడ్జి నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ పూర్తి నాసిరకంగా.. నాణ్యత లేకుండా నిర్మిస్తోందని వారు ఆరోపించారు. రూ. 65 లక్షల నాబార్డు నిధుల ద్వారా భువనగిరి మండలం నామత్ పల్లి - జిట్టలో బావిగూడెం మధ్య శరత్ చంద్ర కన్ స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న బ్రిడ్జి నాసిరకంగా ఉందని గ్రామస్తులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త బృందం ఇవాళ బ్రిడ్జి వద్దకు వచ్చి నిర్మాణాన్ని పరిశీలించారు.