డబుల్ బెడ్రూంల పేరిట మోసం : వెరబెల్లి రఘునాథ్​రావు

లక్సెట్టిపేట, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశాడని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. శుక్రవారం అర్హులైన పేదలతో కలిసి లక్సెట్టిపేట తహసీల్దార్​ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. సీఎం కేసీఆర్​కు ప్రజలను దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ వారి సమస్యల పరిష్కారంపై లేదన్నారు. తొమ్మిదేండ్లుగా డబుల్ బెడ్రూంలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

 ప్రధానమంత్రి అవాస యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను రాష్ట్ర సర్కారు పేదలకు అందకుండా అడ్డుకుంటోందని ఫైర్​అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూంలు కట్టిస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోనుగోటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్​ రావు, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్

 పాల్గొన్నారు.