డబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న మహిళలు

కరీంనగర్ జిల్లా చింతకుంట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కొందరు మహిళలు ఆక్రమించుకున్నారు. దాదాపు 30మంది మహిళలు ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్ రూం ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. అపార్టు మెంట్ పద్ధతిలో కట్టిన ఫ్లాట్లపై తమ పేర్లు రాసుకున్నారు. నిరుపేదలైన తాము అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చామన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మహిళలకు స్థానిక బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. నిర్మాణం పూర్తై నెలలు గడుస్తున్నా అర్హులకు అలాట్ చేయకపోవడంతోనే వారు వాటిని ఆక్రమించుకున్నారని చెప్పారు.