![Devil Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ డెవిల్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?](https://static.v6velugu.com/uploads/2024/02/poorna-devil-movie-ott-streaming-in-amazon-prime-video_MwSs5RFfev.jpg)
సౌత్ నటి పూర్ణ (Poorna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు మళయాళ నటి అయినప్పటికీ.. తెలుగు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..రీసెంట్గా హారర్ మూవీ డెవిల్(Devil)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి రాగా..ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో డెవిల్ మూవీ మార్చి 1న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.
డెవిల్ కథ విషయానికి వస్తే..హేమ అనే గృహిణిగా పూర్ణ ఇందులో కనిపించింది.హేమా భర్త అలెక్స్ పేరు మోసిన లాయర్. ఇతను తన ఆఫీస్‌లోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ) అనే అమ్మాయితో సీక్రెట్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు.అతడో స్త్రీలోలుడు. ఓ యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోషన్(త్రిగుణ్) వస్తాడు. రోషన్, హేమల బంధం గురించి తెలిసి అలెక్స్ ఏం చేశాడన్నదే డెవిల్ మూవీ కథ.
నటి పూర్ణ సీమ టపాకాయి, లడ్డు బాబు, అవును, రాజు గారి గది, రాక్షసి వంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు పూర్ణ. అయితే చాలా గ్యాప్ తరువాత ఆమె నటించిన డెవిల్ ఓటీటీ ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకి ఆథియా దర్శకత్వం వహించారు.