వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పరిధి ధన్నారంలోని స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌లో ‘ పూర్ణ్ వికాస్’ ఉచిత రెసిడెన్షియల్ లో యజ్ఞం ఫౌండేషన్ ద్వారా ఆదివారం నుంచి ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ప్రారంభమైంది. ఇందులో గురుకుల్ ఎక్సలెన్స్ కిడ్స్‌తో పాటు సుమారు 250 నుంచి 300 మంది పిల్లలు పాల్గొన్నారు.
ఇది మే 12 వ తేదీ వరకు కొనసాగుతుంది. అవుట్‌డోర్ గేమ్‌లు – ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, మల్ ఖంబ్ , తైక్వాండో, స్విమ్మింగ్, ఇండోర్ యాక్టివిటీస్ – టేబుల్ టెన్నిస్, చదరంగం, సైన్స్ ఆడియో- విజువల్ యాక్టివిటీలు నేర్పిస్తారు. ఆధ్యాత్మిక విద్య, యోగా, పుస్తక పఠనం, మైండ్‌మేనేజ్‌మెంట్ గేమ్‌లు, క్రాఫ్ట్, డ్రాయింగ్ మొదలైన వాటిలో శిక్షణ అందిస్తారు. బయట నుంచి పాల్గొనే విద్యార్థులకు ఉచితంగా ఆహారం, వసతి అందిస్తామని యజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఉజ్వల రాజ్ తెలిపారు.