అయ్యో పాపం : మైఖేల్ జాక్సన్ సోదరుడు.. గుండెపోటుతో చనిపోయాడు

అయ్యో పాపం : మైఖేల్ జాక్సన్ సోదరుడు.. గుండెపోటుతో చనిపోయాడు

ప్రముఖ ఫేమస్ పాప్ సింగర్ రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్  ఈరోజు (సెప్టెంబరు 16, 2024) గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా ఈ విషయాన్ని టిటో జాక్సన్ తనయులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా టిటో జాక్సన్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

అయితే టిటో జాక్సన్ దివంగత ఫెమస్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కి సోదరుడు. మొదట్లో టిటో జాక్సన్ గిటార్ వాయించేవాడు. ఆ తర్వాత తన సోదరులతో కలసి జాక్సన్ 5 అనే అమెరికన్ పాప్ బ్యాండ్ సంస్థని ప్రారంభించారు. 1997లో రాక్ & రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌ ఆల్బమ్ తో ఒక్కసారిగా ఫెమస్ అయ్యారు. దీంతో అప్పటినుంచి వరుస ఆల్బమ్స్ చేస్తూ టిటో జాక్సన్ ఏకంగా ది కింగ్ ఆఫ్ పాప్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ALSO READ | ఐశ్వర్య రజినీకాంత్ మానవత్వం : డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏటా రూ.10 లక్షల విరాళం

మైఖేల్ జాక్సన్ తన స్టెప్పులతో అదరగొడితే టిటో జాక్సన్ తన అద్భుతమైన పాప్ పాటలతో అలరించాడు. దీంతో ఉన్నట్లుండి తమ అభిమాన సింగర్ మరణించడంతో పలువురు అభిమానులు టిటో జాక్సన్ ఆత్మకి శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.