
ప్రపంచ క్రైస్తవుల మతాధికారి, వాటికన్ సిటీ అధ్యక్షుడు అయిన పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో 2025, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం కన్నుమూసినట్లు వాటికన్ సిటీ వెల్లడించింది.
పోప్ ఫ్రాన్సిస్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు డబుల్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈస్టర్ ముందు రోజు పోప్ ఫ్రావిన్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన 24 గంటల్లోనే.. ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు వాటికన్ కామెరెలెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో పుట్టిన జార్జ్ మారియో బెర్గోగ్లియో.. కేథలిక్ చర్చ ఫాదర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. పోప్ గా ఎన్నికైన మొదటి లాటిన్ అమెరికా వ్యక్తిగా పోప్ ఫ్రావిన్స్ కావటం విశేషం. వాటికన్ సిటీలో.. క్రైస్తవుల మత గురువుగా ఆయన 2013లో పోప్ బాధ్యతలు స్వీకరించారు. పోప్ గా తన జీవిత కాలంలో.. సామాజిక న్యాయం, పేద వర్గాలకు న్యాయం చేయటంపై ఎక్కువ దృష్టి పెట్టారు. మతాధికారుల్లో ఆర్థిక పారదర్శకత, అధికారాల దుర్వినియోగంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టిన పోప్ ఫ్రావిన్స్.. ఆ దిశగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
కొన్ని సంవత్సరాలుగా పోప్ ఫ్రావిన్స్ చాలా సార్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. న్యూమోనియా, శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం ఉన్నప్పటికీ విధుల్లో చురుగ్గా ఉండేవారు. పైప్ ద్వారా శ్వాస తీసుకుంటూ చాలా సార్లు తన భక్తులకు దర్శనం ఇచ్చేవారు పోప్ ఫ్రావిన్స్.