పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం : అధ్యక్షుడు ట్రంప్తో ఎందరో రాక

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం : అధ్యక్షుడు ట్రంప్తో ఎందరో రాక

క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను శనివారం.. అంటే 2025, ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది వాటికన్ సిటీ. పోప్ ఫ్రాన్సిస్ శవ పేటికలో ఉన్న ఫొటోలు సైతం విడుదల చేసింది. అధికారిక వీడ్కోలుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయ్యిందని.. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది అధ్యక్షులు, ఇతర ప్రముఖలు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 

పోప్ హోదాలో ఎవరైనా చనిపోతే.. వాటికన్ సిటీలోనే అంత్యక్రియలు చేస్తారు. ఈసారి అందుకు భిన్నంగా.. పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక మేరకు.. అతని అంత్యక్రియలను రోమ్ లోని మేరీ మేజర్ బసిలికా చర్చిలో ఖననం చేయనున్నట్లు ప్రకటించింది వాటికన్ సిటీ. 

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే హాజరు అవుతున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది వాటికన్ సిటీ. 

పోప్ ఫ్రాన్సిస్ శవపేటికలో ఉన్న ఫొటోలను విడుదల చేసింది. వీడ్కోలుకు సమయం వచ్చింది.. ప్రక్రియ ప్రారంభం అయ్యింది అంటూ వెల్లడించిన వాటికన్ సిటీ అధికారులు.. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు ఎలాంటి ఆర్భాటం, అలంకరణ లేకుండా సహజమైన రీతిలో.. అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

అంత్యక్రియల గురించి ముందే చెప్పిన పోప్

తన అంత్యక్రియలు ఎక్కడ.. ఎలా చేయాలన్న దానిపై పోప్ ఫ్రాన్సిస్ ముందుగానే తన అనుచరులకు వివరించారు. తాను చనిపోయాక సాంప్రదాయ త్రిపుల్ కాఫిన్‌‌కు బదులు ఒకే చెక్క, జింక్ కాఫిన్‌‌లో ఖననం చేయాలని కోరుకున్నారు. వాటికన్ గ్రోటోస్‌‌కు బదులు సాంటా మరియా మాగియోర్ బసిలికాలో ఖననం చేయాలని సూచించారు. వందేండ్ల తర్వాత వాటికన్ సిటీ బయట ఖననం చేస్తున్న మొదటి పోప్​గా ఆయన నిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 140  కోట్ల క్యాథలికులకు నాయకత్వం వహించిన మొదటి జెస్యూట్, దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌‌లో 4 నుంచి 6 రోజుల్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలున్నాయి.

►ALSO READ | పోప్ ఫ్రాన్సిస్ ఖననం ఎక్కడ.. 100 ఏళ్ల తర్వాత మారిన ప్రదేశం : కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారు..?