
వాటికన్‌సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. పోప్ ఫ్రాన్సిస్ఈ నెల 21న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో సహా 50 మంది దేశాధినేతలతో పాటు 130 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు.. సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఆయన సమాధి వద్ద పేదలు ఆయనకు నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఆయన పార్థివదేహం సెయింట్ పీటర్స్ బసిలికాలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఈ మూడు రోజుల్లో 1,28,000 మందికి పైగా ప్రజలు ఆయనకు నివాళులర్పించారు.