
క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. శ్వాసకోస ఇబ్బందులతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శ్వాస కోస ఇబ్బందులతో ఆక్సిజన్ సరిగా అందడం లేదని, శ్వాసనాళాలు పూర్తిగా దెబ్బ తినటంతో ఆక్సిజన్ అందించడం కష్టంగా ఉందని వాటికన్ సిటీ ప్రకటించింది.
88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్.. న్యూమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరి గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. బ్లడ్ ఇన్ ఫెక్షన్ కారణంగా ప్లేట్ లెట్స్ పడిపోయాయని, ఎనీమియా కూడా వచ్చిందని వైద్యులు వెల్లడించారు. వైద్యానికి పోప్ స్పందిస్తున్నారని, డాక్టర్లు ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పినట్లు పోప్ మెడికల్ టీమ్ తెలిపింది.
ఊపిరితిత్తుల వ్యాధితో ఫిబ్రవరి 14న పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరారు. బ్యాక్టీరియా, వైరల్ ఫీవర్ తో పాటు శ్వాసనాళాల్లో ఏర్పడిన ఫంగస్ ఇన్ ఫెక్షన్ కారణంగా పోప్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోంది. తాజాగా శ్వాస నాళాలు దెబ్బతినటంతో ఆరోగ్యం మరింత విషమంగా మారిందని వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.