ఐదు వారాల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్.. గాజాపై బాంబుల వర్షం ఆపాలని ఇజ్రాయెల్కు సూచన

ఐదు వారాల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్.. గాజాపై బాంబుల వర్షం ఆపాలని ఇజ్రాయెల్కు సూచన

అనారోగ్యం కారణంగా గత ఐదు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్ అయ్యారు.  రోమ్ నగరంలోని గెమెల్లీ యూనివర్సిటీ ఆస్పత్రిలో పొందుతున్న ఆయనను ఆదివారం (మార్చి 23) వైద్యులు డిశ్చార్జ్ చేశారు. న్యుమోనియా కారణంగా ఫిబ్రవరి 14 న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఫ్రాన్సిస్ కోలుకున్నారని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. 

తనను చూసేందుకు హాస్పిటల్ కు వచ్చినవారికి వీల్ చైర్ లోనే ఉండి అభివాదం చేశారు పోప్. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి భారీ భద్రత నడుమ వాటికన్ సిటీలోని కాసా సాంట మార్ట హోమ్ కు తీసుకెళ్లారు. 

 ఎయిర్ స్ట్రైక్ కు ఇజ్రాయెల్ ముగింపు పలకాల్సిందిగా పిలుపు:

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పోప్ ముందుగా గాజా స్ట్రిప్ అంశంపై స్పందించారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఆపాలని, వేల మంది అమాయకులు బలి అవుతున్నారని, ఈ యుద్ధం వెంటనే ఆపాల్సిందిగా కోరారు. కాల్పుల విరమణను పాటించాలని, శాంతి చర్చలు జరగాలని సూచించారు. 

ALSO READ : అమెరికాలో దారుణం.. ఇండియాకు చెందిన తండ్రీకూతురితో తాగుబోతు గొడవ.. గన్తో ఇద్దరినీ కాల్చేశాడు..

గాజా స్ట్రిప్ లో మానవత్వపు ఛాయలు మళ్లీ పరిమళించాలని, మారణహోమం ఆగాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.