
క్రైస్తవ ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత మైక్రోబయిల్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో గత శుక్రవారం ( ఫిబ్రవరి 14 ) ఆసుపత్రిలో చేరారు పొప్. 88 ఏళ్ళ పోప్ రెండు ఊపిరితిత్తులకు నిమోనియా సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు. పోప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వాటికన్ వర్గాలు చెబుతున్నప్పటికీ పోప్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిమోనియాతో పోరాటంలో తాను గెలవలెనని పోప్ తన సహాయకులతో చెప్పినట్లు ఆ వార్త సారాంశం.
నిమోనియా నుండి రికవర్ అవ్వలేనని.. తాను ఎక్కువ కాలం బతకనని పోప్ తన సహాయకులతో అన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోప్ వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మద్దలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోప్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మంగళవారం ( ఫిబ్రవరి 18 ) రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని.. బుధవారం ( ఫిబ్రవరి 19 ) ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా చేసినట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : అదానీపై విచారణకు యూఎస్ SEC
పోప్ నిమోనియాతో పాటు ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ తో కూడా బాధపడుతున్నారని.. దీనికి యాంటిబయాటిక్ ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్లు తెలిపారు. పలు రకాల వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ రికవర్ అవ్వడం ఇబ్బందిగా మారిందని డాక్టర్లు తెలిపారు.