
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందాడు. ఒక ప్రోగ్రాం షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం కు వెళ్లిన రాకేష్ మాస్టర్.. తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గాంధీ హాస్పిటల్ లో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ గాంధీఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డయాబెటిక్ పేషంట్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
1968 తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు. తెలుగు సినీ పరిశ్రమలో 1500 సినిమాలకు పైగా పనిచేశారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పని చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, హీరో వేణు, నటి ప్రత్యుష వంటి వాళ్ళు రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియో గ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే.
ఇక ఈటీవీ వేదికగా ప్రసారమైన డ్యాన్స్ షో ఢీ లో వన్ అఫ్ ది కొరియోగ్రాఫర్ గా చేశారు రాకేష్ మాస్టర్. అంతేకాదు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో పలు ఎపిసోడ్లో కనిపించాడు. 2020 సంవత్సరానికి గానూ గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.
ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.