బాక్స్ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు భలే క్రేజ్‌‌‌‌‌‌‌‌..!

బాక్స్ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు భలే క్రేజ్‌‌‌‌‌‌‌‌..!
  • ఖాళీ ప్లాట్లలో బాక్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో నెట్‌‌‌‌‌‌‌‌ కట్టి, కార్పెట్‌‌‌‌‌‌‌‌ గ్రాస్‌‌‌‌‌‌‌‌తో సెటప్‌‌‌‌‌‌‌‌
  • బయట ప్లేస్‌‌‌‌‌‌‌‌లు లేకపోవడంతో బాక్స్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వైపు యువత మొగ్గు
  • గంటకు రూ.600 నుంచి రూ.800 వసూలు చేస్తున్న నిర్వాహకులు

ఖమ్మం, వెలుగు : క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడాలని ఆసక్తి ఉన్నా.. తగిన ప్లేస్‌‌‌‌‌‌‌‌ లేక ఇబ్బంది పడుతున్న వారికి బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్రేజ్‌‌‌‌‌‌‌‌ పట్టుకుంది. మూడునాలుగేండ్ల కింద హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన ఈ బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ పద్ధతి ఇతర నగరాలకు కూడా విస్తరించింది. పట్టణాల్లో ఇండ్ల మధ్య కాస్త ఖాళీ ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారు వ్యాపార కోణంలో ఆలోచించి బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ సెటప్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో స్కూల్, కాలేజీ లేని రోజుల్లో స్టూడెంట్స్, సాయంత్రం, వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగులు బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ కోసం క్యూ కడుతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల నుంచి 40 ఏండ్ల వయస్సు ఉన్న వారి వరకు ఇందులో క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 

300 గజాల స్థలంలోనే మొత్తం సెటప్‌‌‌‌‌‌‌‌

బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ కోసం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలంటే సొంత జాగా ఉన్న వారికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు ఖర్చు అవుతుండగా, జాగాను లీజ్‌‌‌‌‌‌‌‌కు తీసుకుంటే మాత్రం అదనంగా మరో రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 300 గజాలకు పైగా జాగా ఉంటే చాలు, ఇండ్ల మధ్యలో అయినా సెటప్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఉండడంతో ఈ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చుట్టూ ఇనుప కడ్డీలు పాతి బాక్స్‌‌‌‌‌‌‌‌మాదిరిగా ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. బాల్‌‌‌‌‌‌‌‌ బయటకు పోకుండా ఈ బాక్స్‌‌‌‌‌‌‌‌ చుట్టూ గ్రీన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ చుడుతున్నారు. కింద గ్రాస్‌‌‌‌‌‌‌‌ కార్పెట్‌‌‌‌‌‌‌‌ పరుస్తుండడంతో దెబ్బలు తగిలే అవకాశం కూడా లేదు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఫ్లడ్‌‌‌‌‌‌‌‌ లైట్లు కూడా ఏర్పాటు చేస్తుండడంతో రాత్రి టైంలోనూ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడే అవకాశం ఉంటుంది. 

ఖమ్మం నగరంలో ఒకటి రెండేండ్ల కింద రెండు మాత్రమే బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ ఉండగా, గత ఆర్నెళ్లలో మరో ఆరేడు చోట్ల ఏర్పాటయ్యాయి. ఓపెన్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో అయితే బాల్‌‌‌‌‌‌‌‌ కోసం ఎక్కువ దూరం పరిగెత్తాల్సి వస్తుండగా, ఈ బాక్స్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆ ఇబ్బంది కూడా లేదు. దీంతో ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడి నుంచి బయటపడేందుకు, చిన్న నాటి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో సరదాగా గడిపేందుకు, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కాపాడుకునేందుకు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ పట్ల ఇంట్రస్ట్ చూపుతున్నారు. వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో రోజంతా ఖాళీ లేకుండా ఎక్కువ మంది వస్తుండగా, ఇతర రోజుల్లో మాత్రం సాయంత్రం నుంచి రాత్రి వరకు రద్దీ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిమాండ్‌‌‌‌‌‌‌‌ను బట్టి గంటకు రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. 

ALSO READ : హైదరాబాద్​లో కొత్త ఐటీ పార్క్..సీఎం సింగపూర్ టూర్​ సక్సెస్..​

కోట్లు ఖర్చు చేసినా పనికిరాని క్రీడాప్రాంగణాలు

పట్టణాలు, నగరాల్లో కాకుండా.. ప్రస్తుతం గ్రామాల్లోనూ ఇప్పుడు ఆటలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్లు దొరకడం లేదు. ఖాళీగా ఉన్న వెంచర్లలోనో, అక్కడో, ఇక్కడో ఉన్న స్టేడియాల్లోనో పిల్లలు, యువకులు క్రికెడ్‌‌‌‌‌‌‌‌ ఆడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో కంప చెట్లు మొలవడం, చెత్తాచెదారంతో నిండిపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాల్లో ఇప్పుడు బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సుమారు రూ.12 కోట్లకు పైగా ఖర్చు చేసి 1,170 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కానీ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో అవన్నీ పడావు పడ్డాయి. దీంతో యువత బాక్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ వైపు ఆసక్తి చూపుతోంది.

40 ఏండ్లు ఉన్న వారు సైతం వస్తున్నారు 

బాక్స్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్, ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఆదివారం, సెలవు రోజుల్లో ఐదో తరగతి నుంచి ఆపైన చదివే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నారు. వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. 35 ఏండ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయసుండి, జాబ్‌‌‌‌‌‌‌‌ చేసే వాళ్లు కూడా వచ్చి సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలకైతే గంటకు రూ.300 వరకు, పెద్దలకైతే రూ.800 వరకు తీసుకుంటున్నాం. 


– వెంకట సాయికుమార్,బీవీఎస్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎరీనా, ఖమ్మం -