Viral news: సూప్లో ఎలుక, భోజనంలో బొద్దింక..2వేల జపనీస్ రెస్టారెంట్స్ మూసివేత

Viral news: సూప్లో ఎలుక, భోజనంలో బొద్దింక..2వేల జపనీస్ రెస్టారెంట్స్ మూసివేత

మనలో చాలామంది సరదాగా బయటికి వెళ్లినప్పుడు ఏదో ఒకటి తినాలనిపించి రెస్టారెంట్ కో, హోటళ్లకో వెళ్లి అక్కడ ఉంటే స్పెషల్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకొని తింటుంటాం..అయితే ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ గురించి భయంకరమైన నిజాలు తరుచుగా సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. బిర్యానిలో బొద్దింక, హోటళ్లలో కుళ్లిన మాంసంతో వంటకాలు, పరిశుభ్రంగా లేని రెస్టారెంట్లు, వాటి ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ చూస్తున్నాం.. సీజ్ చేస్తున్నారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం చూడండి..సూప్లో ఎలుక వచ్చిందని కస్టమర్లు కంప్లయింట్ చేయగానే వెంటనే ఓనర్ ఆ రెస్టారెంట్ కు చెందిన దాదాపు 2వేల బ్రాంచ్లను వెంటనే మూసివేయించారు. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ జపనీస్ రెస్టారెంట్ చైన్ సుకియా యాజమాన్యం తన 2వేల బ్రాంచ్ లను మూసివేసింది. కారణం ఒక్కటే..కస్టమర్ కంప్లయింట్..తిట్టోరిలోని చైన్ సుకియా రెస్టారెంట్ బ్రాంచ్ లో ఓ రెగ్యులర్ కస్టమర్ సూప్ ఆర్డర్ చేస్తే అందులో ఓ ఎలుక పడింది. దీంతో ఆ కస్టమర్ యాజమాన్యానికి కంప్లయింట్ చేశాడు. ఈ సంఘటన జనవరిలో జరిగింది. మార్చిలో టోక్యోలో జరిగిన మరో  సంఘటనలో పుడ్ లో బొద్దింక వచ్చింది. దీంతో ఓనర్ కు సిబ్బందిపై చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ రెస్టారెండ్ కు చెందిన బ్రాంచీలన్నింటిని తాత్కాలికంగా క్లోజ్ చేశాడు.తన అన్ని బ్రాంచ్ లలో ఫుడ్ నాణ్యతపై చెకింగ్ కు ఆర్డరేశాడు. 

జపాన్ లో పేరున్న రెస్టారెంట్ కావడంతో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కస్టమర్లకు క్షమాపణ చెప్పింది. అంతేకాదు కస్టమర్ కంప్లయింట్ ను సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం అన్ని రెస్టారెంట్ బ్రాంచ్ లను మార్చి31 నుంచి ఏప్రిల్ 4 వరకు మూసివేసింది. ఫుడ్ నాణ్యతపై జాగ్రత్తలు తీసుకునేందుకు సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చింది. 
 
సుకియా రెస్టారెంట్1982లో తొలి బ్రాంచ్ను యోకోహామాలో కెంటారో ఒగావా ప్రారంభించారు. చైనా గ్యూడాన్ కు ప్రసిద్ది. సన్నగా కోసిన మాంసం , ఉల్లిపాయలతో తయారు చేయబడిన ఓ సాంప్రదాయక వంటకం. తీపి సోయాను ఉడకబెట్టిన సాస్ లో ఓ గిన్నెలో అన్నంతో వడ్డిస్తారు. జపనీస్ ఆహార పరిశ్రమ దిగ్గజం జెన్‌షో హోల్డింగ్స్ యాజమాన్యంలోని కంపెనీ జపాన్‌లో దాదాపు 2వేల అవుట్‌లెట్లను కలిగి ఉంది. చైనా, తైవాన్, సింగపూర్, థాయిలాండ్, బ్రెజిల్,మెక్సికోతో సహా విదేశాలలో దాదాపు 660 స్టోర్లను కలిగి ఉంది. మంచి గుర్తింపు ఉంది. అందుకే యాజమాన్యం ఆ గుర్తింపును నిలబెట్టుకునేందుకు రెస్టారెంట్లు అన్నింటిని తాత్కాలికంగా మూసివేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.