ప్రముఖ దర్శకుడు మృతి

ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్‌‌‌‌ఎన్‌‌ఆర్ మనోహర్ (61) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని వారాలుగా చెన్నైలోని ఓ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందారు. ఫేమస్‌‌ డైరెక్టర్‌‌‌‌ కె.ఎస్.రవికుమార్ దగ్గర అసిస్టెంట్‌‌గా తన కెరీర్‌‌‌‌ను స్టార్ట్ చేశారు మనోహర్. పలు చిత్రాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. 2009లో ‘మాసిలామణి’ సినిమాతో దర్శకుడిగానూ మారారు. ఇక నటుడిగా ఆయన తెలుగు వారికి కూడా బాగా పరిచయం. డాక్టర్ సలీమ్, కాంచన 3, అయోగ్య, బందోబస్త్, ఖైదీ, భూమి, టెడ్డీ వంటి డబ్బింగ్ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు మనోహర్. నాగచైతన్య హీరోగా గౌతమ్‌‌ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలోనూ నటించారు. అంత మంచి నటుడు, రచయిత అర్ధంతరంగా మరణించడం తీరని లోటంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.