జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కనుకే జాన్వీతో పాటు మరో హీరోయిన్ ని కూడా సెలక్ట్ చేశారు డైరెక్టర్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన మరో బ్యూటీని రంగంలోకి దింపారు కొరటాల. ఎన్టీఆర్ సరసన మరాఠీ నటి శ్రుతి మరాఠే(Shruti Marathe)ని ఎంచుకున్నారు. ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత..శృతి మరాఠే ఎవరనేది తెగ సెర్చ్ చేస్తున్నారు.
శ్రుతి మరాఠే విషయానికి వస్తే..
శ్రుతి మరాఠే..గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. ఆమె మరాఠ, హిందీ,తమిళ మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2008లో మరాఠీలో వచ్చిన సనై చౌఘడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇక ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..శ్రుతి మరాటే కూడా రియాక్ట్ అయింది.
తారక్ అంటే చాలా ఇష్టం అని ఆమె పోస్ట్ చేయడంతో..ఈ వార్త నిజమేనంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మరి దేవరలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే మాత్రం..టాలీవుడ్లో ఫేమస్ అవ్వడం కన్ఫర్మ్. కానీ,ఇప్పటివరకు దేవర మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో దేవర మేకర్స్ నుంచి శ్రుతి మరాఠే నటిస్తున్న విషయంపై ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
రెండు భాగాలుగా తెరకెక్కు తున్న దేవర మూవీ ఫస్ట్ పార్ట్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు మేకర్స్.కానీ ఆ డేట్‌కు వచ్చే చాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.
ALSO READ :- గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన నటుడు మిథున్ చక్రవర్తి
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయి నా, వీఎఫ్‌ఎక్స్‌తో పాటు సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ కు ఇటీవలే గాయాలవడంతో తన పోర్షన్ షూటింగ్ బ్యా లెన్స్ ఉండటంతో మరో మూడు నెలలు రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.