
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేట్లోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోన్న కల్పన.. గత రెండు రోజులుగా ఇంటి డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె అపార్ట్ మెంట్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
పోలీసులు హుటాహుటిన సింగర్ కల్పనను నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కల్పన హెల్త్ కండీషన్ ప్రస్తుతం ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.